Srisailam Project:శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం

by Jakkula Mamatha |
Srisailam Project:శ్రీశైలం జలాశయానికి ఎగువ  ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం
X

దిశ, శ్రీశైలం ప్రాజెక్టు:శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయం ఆనకట్ట నుంచి 7 గేట్లు ద్వారా 10 అడుగుల మేర ఎత్తి దిగువ సాగరకు 1,91387 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయానికి జలాశయం నీటిమట్టం 883,50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 207.4103 టీఎంసీలు ఉంది. అలాగే కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో గడిచిన 24 గంటలలో 25,684 క్యూసెక్కుల నీటితో 16.44 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.69 ఉత్పత్తిని చేస్తూ దిగువ నాగార్జునసాగర్ కు విద్యుత్ ఉత్పాదన ద్వారా 61,810, 7 గేట్ల ద్వారా 1,91,387 క్యూసెక్కులతో కలిపి 2,52,386 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇలాగే వరద కొనసాగుతాయి మరో రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే యోచనలో అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story