రాజధాని పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా

by sudharani |   ( Updated:2023-02-27 09:00:47.0  )
రాజధాని పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్నంల ధర్మాసనం కేసు విచారణను చేపట్టారు. అయితే అమరావతి రాజధానిగా కొనసాగింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను త్వరగా విచారణ తీసుకోవాలని ధర్మాసనాన్ని మరోసారి ప్రభుత్వం తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

ఈ విజ్ఞప్తిపట్ల ధర్మాసనం స్పందించింది. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. వాస్తవానికి గత వారం రాజధాని అంశంపై విచారణ జరగాల్సి ఉంది. అయితే రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసింది. దీంతో విచారణ కాస్త వాయిదా వేసింది. అయితే తేదీని ఖారు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed