Amaravati: అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

by sudharani |   ( Updated:2022-11-01 07:28:54.0  )
Amaravati: అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ అమరావతి ప్రాంత రైతులు సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అయితే అమరావతి పిటిషన్ల విచారణపై సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ విముఖత చూపారు.

తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ ఆదేశించారు. ఇకపోతే అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంగళవారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ తరపున ప్రధాన న్యాయమూర్తి వాదనలు వినిపించారు. ఇప్పుడు సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన నేతృత్వంలోని బెంచ్ విచారించడంపై విముఖత చూపినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్

Advertisement

Next Story

Most Viewed