వైసీపీకి మరో బిగ్ షాక్.. విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు

by Mahesh |   ( Updated:2024-06-22 07:37:56.0  )
వైసీపీకి మరో బిగ్ షాక్.. విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీకి కొత్త ప్రభుత్వం వరుస షాక్ లు ఇస్తుంది.ఈ క్రమంలోనే తాడెపల్లిలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఇది మరవక ముందే.. విశాఖ పట్టణ సమీపంలో ఎండాడడలో నిర్మించిన వైసీపీ కార్యాలయానికి గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులలో వైసీపీ భవన నిర్మాణం అక్రమంగా జరిగిందని తెలిపింది. తక్షణమే ఆ భవనంలో కార్యకలాపాలు నిలిపివేసి, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని.. GVMC అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed