ఏపీ రైతులకు శుభవార్త.. సున్నా వడ్డీ పంట రుణాలు.. జమ ఎప్పుడో తెలుసా?

by srinivas |
ఏపీ రైతులకు శుభవార్త.. సున్నా వడ్డీ పంట రుణాలు.. జమ ఎప్పుడో తెలుసా?
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ రైతులకు సీఎం జగన్ (Cm Jagan) శుభవార్త వినిపించారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు (Zero Interest Crop Loans) ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పంట రుణాలతో పాటు ఇన్ పుట్ సబ్సిడీని ఈ నెల 29న రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. వ్యవసాయ శాఖపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు పంటను అమ్ముకునే పరిస్థితి రైతుకు రాకూడదని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల పాత్ర ఉండకూడదని, రైతులు నష్టపోకుండా ఇ- క్రాపింగ్ డేటా (E- cropping data) ఆధారంగా ధాన్యం సేకరించాలని ఆదేశించారు. రబీ పంటకు ఎరువులు(Fertilizers), విత్తనాలు (Seeds) సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. అలాగే హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ యంత్ర సామాగ్రి రైతులకు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed