బంగ్లాతో తొలి టెస్టులో టీమ్​ ఇండియా 376 పరుగులకు ఆలౌట్

by Y. Venkata Narasimha Reddy |
బంగ్లాతో తొలి టెస్టులో టీమ్​ ఇండియా 376 పరుగులకు ఆలౌట్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్​ ఇండియా 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్‌ 339/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు మరో 37 పరుగులు మాత్రమే చేసి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. రెండోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే చివరి నాలుగు వికెట్లను 37పరుగులకే చేజార్చుకుని 376 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56), రిషభ్‌ పంత్ (39)తో అద్భుతంగా రాణించారు. బంగ్లా బౌలర్‌ హసన్ మహ్మద్5/83 వికెట్లు తీసి భారత్​ మరింత భారీ స్కోర్ చేయకుండా అడ్డకున్నాడు. తస్కిన్ 3, మెహిదీ, నహిద్ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమ్​ ఇండియా 144/6 నుంచి 376/10 స్కోరు సాధించడం విశేషం. అంటే చివరి నాలుగు వికెట్లలో భారత బ్యాటర్లు 232 పరుగులను చేశారు. ఆరు లేదా అంతకన్నా తక్కువ(150 కంటే తక్కువ స్కోరు)కే వికెట్లను కోల్పోయిన తర్వాత ఎక్కువ పరుగులు సాధించిన రెండో మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం.ఈ మ్యాచ్​లో అశ్విన్ - రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించగా, వీరిద్దరు ఏడో వికెట్‌కు 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్​పై ఏ వికెట్‌కైనా ఇది ఐదో అత్యధిక పార్టనర్‌షిప్‌. 2015లో శిఖర్ ధావన్ - మురళీ విజయ్ 283 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు . టెస్టు మ్యాచుల్లో టీమ్​ ఇండియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఐదో బంగ్లా బౌలర్‌ గా హసన్ నిలిచాడు. అంతకుముందు నైముర్ రహ్మాన్, షకిబ్ అల్ హసన్, మెహిదీ హసన్, షహదాత్ ఈ మార్క్​ను టచ్​ చేశారు. కానీ, భారత వేదికపై మాత్రం హసనే మొదటి బౌలర్‌ కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed