- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Accident : రాంగ్ రూట్‌లో ఎస్‌యూవీ కారు.. బైక్ రైడర్ ఘోరమైన క్రాష్.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి ఘటననే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూఢిల్లీ ద్వారకలోని పోచన్ పూర్ నివాసి అక్షత్ గార్గ్ అనే బైక్ రైడర్ తలకు హెల్మెట్, చేతులకు గ్లోవ్స్ అన్నీ సేఫ్టీ గేర్‌లను ధరించి తన బైక్‌పై గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్ II గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో వెళ్తున్నాడు. అతడి స్నేహితుడు ప్రద్యుమన్ కుమార్ అతని వెనుక మరొక బైక్‌పై గోప్రో కెమెరా ధరించి షూట్ చేస్తున్నాడు. ఇంతలో రోడ్డు మలుపు రావడంతో బైక్‌పై ముందుకు దూసుకెళ్లిన అక్షత్ గార్గ్.. అదేసయంలో రాంగ్ రూట్లో వస్తున్న ఎస్‌యూవీని అతి వేగంతో ఢీ కొట్టాడు. నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి బైకర్‌ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. కానీ అప్పటికే రైడర్ అక్షత్ గార్గ్( 23) మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి, బాధితుడి స్నేహితుడు ధరించిన గోప్రో కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడు ఎస్‌యూవీ డ్రైవర్ కులదీప్ ఠాకూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, ప్రమాదానికి కారణమైన నిందితుడి కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 300పై ఓ రాజకీయ పార్టీ స్టిక్కర్ ఉన్నట్లు మృతుడి స్నేహితుడు ప్రద్యుమన్ కుమార్ తెలిపాడు.
‘రాంగ్ రూట్.. ఇతరుల ప్రాణాలు తీయొద్దు ’ సజ్జనార్
ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎక్స్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘రాంగ్ రూట్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం. ఇలా ఉద్దేశ్యపూర్వకంగా రాంగ్ రూట్‌లో వెళ్లి.. ఇతరుల ప్రాణాలు తీయొద్దు. ఈ రోడ్డు ప్రమాదం ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఇటీవల జరిగింది. యాక్సిడెంట్ లో 23 ఏళ్ల బైకర్ దుర్మరణం చెందారు’ అంటూ పోస్ట్ చేశారు.