- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొరపాటు చేశాను క్షమించండి.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, అమితాబ్ బచ్చన్ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో అంతా అయోమయంలో పడిపోయారు.
అసలేం జరిగిందంటే.. అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ వీడియో ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. అయితే అదంతా మరాఠీలో చెప్పారు. కానీ అందులో ఓ పదాన్ని తప్పుగా చెప్పారు. ఈ విషయంపై అమితాబ్ ఇప్పుడు మరాఠి ప్రజలను క్షమాపణలు కోరారు. ‘‘హలో నేను అమితాబ్ బచ్చన్. ఇటీవల ఒక వీడియో చేశాను. నేను చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయను అని. అయితే దానిని మరాఠిలో చెప్పాను కానీ అందులో ఓ పదం తప్పుగా చెప్పా అని నా స్నేహితుడు చెప్పాడు. అందుకే మరాఠి ప్రజలను క్షమాపణలు కోరుతున్నాను. నేను చెత్త వేయను ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.