Viral: ఈ జంటకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదట..! కారణం ఏంటంటే..

by Javid Pasha |
Viral: ఈ జంటకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదట..! కారణం ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలకు వస్తూ అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. అలా వచ్చిన వారిలో చాలా మంది సిటీల్లోనే సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. నివాసాల పరంగా చూసుకుంటే అనేకమందికి సొంత ఇండ్లు ఉండవు. అద్దె ఇండ్లల్లో ఉండేవారి సంఖ్య ఎక్కువే. అయితే ప్రస్తుతం అవి దొరకడం కూడా అంత ఈజీ కాదు. నెలరోజులు సెర్చ్ చేస్తేగానీ మంచి ఇల్లు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా రకరకాల కండిషన్లు ఇంటి ఓనర్లు పెడుతుంటారు. మంచి ఉద్యోగం, సరైన ఆదాయం ఉంటేనే ఇస్తామని కొందరు, ఫ్యామిలీతో ఉంటేనే ఇస్తామని మరికొందరు చెప్తుంటారు. కానీ ఇవి రెండూ ఉన్నప్పటికీ తమకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని ఓ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటలీకి చెందిన అలెసియా కాస్టెల్లాని, డేనియల్ ఎనోనిస్ ఇద్దరూ దంపతులు. వీరు మంచి టాటూ ఆర్టిస్టులు కూడా. ఇటీవల టురిన్ సిటీకి మకాం మార్చారు. కాగా ఇక్కడ ఎంత వెతికినా ఎవరూ వారికి ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. కారణం.. వీరు తమ శరీరంపై వివిధ రకాల టాటూస్ కలిగి ఉండటమే. కొందరు పచ్చబొట్లు శరీరంపై ఉండటం అదృష్టంగా భావిస్తుంటారు. మరికొందరు ఫ్యాషన్ కోసం వేయించుకుంటారు. ఇంకొందరు ఇలా వేయించుకునేవారి పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇక్కడ అదే జరిగింది.

కాగా టూరిన్ సిటీలో ఎక్కువ మంది బాడీపై టాటూస్ కలిగి ఉన్నవారు క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉంటారని నమ్ముతారట. వారెప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడుతుంటారని, వారితో స్నేహం మంచిది కాదని భావిస్తారట. అందుకే అలెసియా కాస్టెల్లాని, డేనియల్ దంపతులు ఎంత తిరిగినా, ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమకు ఎవరైనా సహాయం చేయాలని, ఇల్లు అద్దెకు ఇవ్వాలని కోరారు. ఇక్కడ కూడా దాదాపు వ్యతిరేకతే వచ్చిందట. ఒక ఇంటి యజమాని అయితే తన ఇంటిని తగలబెట్టనైనా తగల బెట్టుకుంటాను కానీ, శరీరంపై టాటూస్ ఉన్నవారికి మాత్రం అద్దెకు ఇవ్వనని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed