- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆశ్రమ పాఠశాలలో.. పంతుళ్ల పంచాయతీ!
by Geesa Chandu |
X
దిశ, కుల్కచర్ల: విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే ఉపాధ్యాయులే వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఘర్షణకు దిగిన సంఘటన కొత్తపల్లి గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం చౌడాపూర్ మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ బాలచందర్ మాతృ వియోగం చెందడంతో విధులకు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలో మరొక ఉపాధ్యాయుని ఇంచార్జ్ గా ఇవ్వడంతో.. సహ ఉపాధ్యాయుల తో సమయపాలన పాటించడం లేదని, విధులకు హాజరు కాకుండా హాజరు వేసుకోవడం, పాఠాలు చెప్పకుండా గదిలో పడుకోవడం పలు అంశాలపై ఉపాధ్యాయు బృందం మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులకు బోధన చేయకుండా ఉపాధ్యాయులే క్రమశిక్షణ రాహిత్యాన్ని బయట పెట్టుకోవడంతో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలసుకున్న ప్రిన్సిపాల్ వారికి సర్ది చెప్పారు.
Advertisement
Next Story