Perni Nani: సీఎం జగన్‌పై ఎవరు పోటీ చేస్తారో తెల్చుకోండి..!

by srinivas |
Perni Nani: సీఎం జగన్‌పై ఎవరు పోటీ చేస్తారో తెల్చుకోండి..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లలో ఇద్దరులో ఎవరైనా పులివెందులలో పోటీ చేసి గెలవాలని మాజీమంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్ లేదా ఇద్దరూ కలిసి లేదా పొత్తులో భాగంగా ఎవరో ఒకరు పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైనాట్ పులివెందుల అని అనడం కాదని.. దమ్ముంటే పోటీ చేసి తమ సత్తా ఏంటో నిరూపించాలన్నారు. మాట్లాడితే వై నాట్ పులివెందుల అనడం పరిపాటిగా మారిందని విమర్శించారు.

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాజీమంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మరోవైపు 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించడమే తమ లక్ష్యమంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. అసలు చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారేమో చూసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో సింగిల్‌గా పోటీ చేసే దమ్ముంటే అప్పుడు 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యం అని చెప్పుకోవాలని మాజీమంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story