- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలా జరిగితేనే జగన్ పీడ పోతుంది: Lokesh
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో సైకో జగన్ ఓడిపోతేనే రాష్ట్రానికి పట్టిన పీడ పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అమరావతి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన ఖండించారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిని పిల్ల సైకోలతో పోల్చారు. పెద్ద సైకో జగన్ పోతేనే ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయని ధ్వజమెత్తారు. పట్టపగలు నడిరోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్ పట్ల వైసీపీ సైకోలు గుండాల కంటే ఘోరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టడమే గాక.. హారన్ కొట్టి డ్రైవర్ పై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. డ్రైవర్ హారన్ కొట్టడమే తప్పైందా అని మండిపడ్డారు. జగన్ దోపిడీలకు అడ్డుపడుతున్నారనే సొంత బాబాయ్ వివేకానందారెడ్డిని చంపారని ఆరోపించారు. ఒక జగన్ సైకో ఫ్యాన్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్ పై హత్యాయత్నం చేశారని నారా లోకేశ్ తీవ్రంగా ఆక్షేపించారు.