- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:పాపపు సొమ్ము ఓటుకు పది వేలు ఇస్తారట..తీసుకోండి! నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి,గుంటూరు:ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ..ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉంది. గత అయిదేళ్లుగా ఒక్కో ఓటరు వద్ద నుంచి లక్ష రూపాయలు దోచుకున్న జగన్ ఇప్పుడు ఖర్చు చేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే తీసుకొని ఓటు మాత్రం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న తమకు వేయాలని కోరారు.
మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్ లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈరోజు 580 మంది పనిచేస్తున్నారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని లోకేష్ చెప్పారు.
Read More..
మంగళగిరిలో లోకేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా: నారా భువనేశ్వరి