ఒక్కటైన పల్నాడు Tdp, Janasena నేతలు, కార్యకర్తలు.. కార్యాచరణపై కీలక ప్రకటన

by srinivas |
ఒక్కటైన పల్నాడు Tdp, Janasena నేతలు, కార్యకర్తలు.. కార్యాచరణపై కీలక ప్రకటన
X

దిశ, వినుకొండ: దుర్మార్గం వైసీపీ ప్రభుత్వాన్ని తుది ముట్టించేంతవరకు టీడీపీ, జనసేన శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన ఆత్మీయ సమావేశం వినుకొండ వై కన్వర్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ఉమ్మడి అభ్యర్థుల విజయం దిశగా కార్యకర్తలు సమన్వయంతో పని చేసి అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సూచించారు. పల్నాడు జిల్లాలో ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు తాను కృషి చేస్తానని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు జాగ్రత్తలు పాటించి ఓట్ల తొలగింపుపై దిష్టి సారించాలని కోరారు. వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జనసేన, టీడీపీ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకు అన్ని విధాల తన సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడించండి. కష్టపడి పని చేసిన జనసేన, టీడీపీ కార్యకర్తలకు సమచిత స్థానం కల్పిస్తామని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

జనసేన పల్నాడు జిల్లా కార్యదర్శి శంకర్రావు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు జనసైనికులు పని చేస్తారని తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని సమన్వయంతో అందరం కలిసి మెలిసి పని చేసి, వచ్చే ఎన్నికల్లో అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కృషి చేస్తామన్నారు.

సమన్వయ కమిటీ కన్వీనర్ నాగశ్రీ మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జనసేన సైనికులు సమన్వయం చేసుకొని ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed