- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Polavaram: దేవినేని ఉమపై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి దేవినేని ఉమపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలవరాన్ని నాశనం చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన మండిపడ్డారు. పోలవరంపై మాజీ మంత్రి దేవినేని ఉమ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో ఫొటోల కోసమే టీడీపీ నాయకులు పోలవరం వెళ్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, ఆయన చొరవతోనే నిధుల కొరత తీరిందని పేర్కొన్నారు. పోలవరం పూర్తికి కేంద్రం రూ.12,911 కోట్లు విడుదల చేసేందుకు రెడీ అయిందని తెలిపారు. ఇంకా మరో రూ.5 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంత్రుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. నాలుగేళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేకపోయారని అంబటి విమర్శించారు.
అలాగే సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ పోటీపై కూడా అంబటి స్పందించారు. తనను ఓడించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సత్తెనపల్లిలో తనపై పోటీ చేసేందుకు వస్తాదులను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై అవినీతిని రుజు చేయాలని డిమాండ్ చేశారు. తనపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తే బీజేపీ చేసినట్టేనన్నారు. బురదజల్లి బీజేపీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.