Breaking: ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన జగన్

by srinivas |   ( Updated:2023-04-03 10:36:33.0  )
Breaking: ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉందని ఎమ్మెల్యేలతో భేటీలో ఆయన తెలిపారు. పనిలో పనిగా మంత్రి‌వర్గ విస్తరణపైనా ఆయన స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరూ గెలవాలని ఆకాంక్షించారు. ఏప్రిల్‌లోగా ప్రతి కుటుంబానికి వైసీపీ పథకాలు చేరాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సెప్టెంబర్ నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోలేమని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుపైనా సీఎం జగన్ స్పందించారు. వాపును చూసి గెలుపు అనుకుంటున్నారని టీడీపీ నేతలపై ఆయన విమర్శలు కురిపించారు. అటు గడప గడపకు కార్యక్రమంపైనా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చించారు. కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని పని చేయాలని సూచించారు. అందరూ ఈ కర్యక్రమంలో పాల్గొంటే పార్టీ గ్రాఫ్ ఆటోమేటిక్‌గా పెరుగుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది.’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. ‘ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉంది కాబట్టి జరిగింది.’ అని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed