- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Skill Case: చంద్రబాబు పిటిషన్లపై లంచ్ బ్రేక్ తర్వాత విచారణ
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపున హైకోర్టు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు సాగాయి. చంద్రబాబు తరపున లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా బలంగా వాదనలు కొనసాగించారు.
అయితే లంచ్ విరామ సమయం కావడంతో మళ్లీ విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో చంద్రబాబు రెండు పిటిషన్లపై లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ వాదనలు కొనసాగనున్నాయి. ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు 52 రోజలుగా రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్న విషయం తెలిసిందే. జైలులో చర్మ వ్యాధి సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు హైకోర్టును కోరుతున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.