Guntur Ycp Leaders: చంద్రబాబును ఏ1గా చేర్చాలని ఎస్పీకి ఫిర్యాదు

by srinivas |
Guntur Ycp Leaders: చంద్రబాబును ఏ1గా చేర్చాలని ఎస్పీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గుంటూరు ఎస్పీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏ1గా చంద్రబాబును చేర్చాలని తెలిపారు. చంద్రబాబు ప్రచార యావతోనే తొక్కిసలాట ఘటన జరిగిందని మేయర్ కావటి మనోహర్ ఆరోపించారు. కాగా గుంటూరు తొక్కిసలాట ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్‌ను ఏ1గా చేర్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed