Ap News: పురంధేశ్వరిపై సజ్జల కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-10-11 10:25:27.0  )
Ap News: పురంధేశ్వరిపై సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పురంధేశ్వరి పేరుకే బీజేపీ నాయకురాలిగా ఉన్నారని.. కానీ టీడీపీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి ఆమె తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పురంధేశ్వరి ఎప్పుడూ అండగానే ఉంటారని సజ్జల తెలిపారు. కాగా ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై ఇటీవల కేంద్రహోంత్రి అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. మద్యంపై వస్తున్న ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని సీబీఐతో విచారణ జరపాలని వినతి పత్రం అందజేశారు. దీంతో పురంధేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు.

Advertisement

Next Story