Breaking: జనసేన గాజు గ్లాసు గుర్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-14 11:35:08.0  )
Breaking: జనసేన గాజు గ్లాసు గుర్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ గుర్తుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు. జనసేనకు సంస్థాగతంగా కూర్పులేదని ఆయన ఎద్దేవా చేశారు. గాజు గ్లాసు గుర్తు ఎవరూ తీసుకోకపోతే ఎన్నికల సంఘం జనసేనకు ఇస్తారేమోనని వ్యగ్యంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రపైనా సజ్జల విమర్శలు చేశారు. చంద్రబాబు పల్లకీ మోయడానికే పవన్ వారాహి యాత్ర అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చిన అసైన్‌మెంట్‌తో పవన్ కల్యాణ్ బయల్దేరారన్నారు. సీఎం జగన్‌పై అమిషా చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా చేసినవి వ్యాఖ్యలు కాదని.. తీవ్ర ఆరోపణలని మండిపడ్డారు. ఏపీ అసలు దేశంలోనిది కాదన్నట్టు మాట్లాడారని .. తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్ షా చదివారని సజ్జల ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story