Ali : అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్

by srinivas |
Ali : అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్
X

దిశ,(డైనమిక్ బ్యూరో): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. ప్రభుత్వ సలహాదారు(ఎలక్ట్రానిక్ మీడియా), సినీనటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరుకానున్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం జగన్ తన నివాసం నుంచి 4.55గంటలకు బయలు దేరతారు. నేరుగా గుంటూరు ఇన్నర్‌ రింగ్ రోడ్ శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్‌హాల్‌‌కు చేరుకుంటారు. రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed