- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ విజన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీతోనే నవ్యాంధ్రకు భవిష్యత్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా పొన్నూరులో సోమవారం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించి టీడీపీకి తిరుగులేని విజయాన్ని అందించాలన్నారు. తెలుగుజాతి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారన్నారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం, రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం, రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన..ఇదీ సీఎం జగన్ మార్క్ అన్నారు. గంజాయి సరఫరాలో ఏపీని నెంబర్ వన్ చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం, పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్ అన్నారు. నాది విజన్ అయితే..జగన్ ది పాయిజన్ అని దుయ్యబట్టారు. దేశంలోని టాప్-10 వర్సిటీలు, స్కూళ్లు రాష్ట్రానికి తీసుకురావాలని అనుకున్నామని, అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారన్నారు. టీడీపీ కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకోవడం సిగ్గుచేటన్నారు. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని, ప్రజలకు బంగారు భవిష్యత్తు అందిస్తానని చంద్రబాబు పునరుద్ఘటించారు.