Ap News: టీడీపీ, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల.. 11 కీలక అంశాలివే..

by srinivas |   ( Updated:2023-11-13 13:59:26.0  )
Ap News: టీడీపీ, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల.. 11 కీలక అంశాలివే..
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదలైంది.మొత్తం 11 అంశాలకు ఈ రెండు పార్టీలు అంగీకారం తెలిపాయి. ఇందులో 6 అంశాలను టీడీపీ ప్రతిపాదించగా... ఐదు అంశాలను జనసేన సూచించింది. ఈ 11 అంశాలను చేర్చి టీడీపీ-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్ట్‌ను ఆ పార్టీల కమిటీ నేతలు రూపొందించారు. టీడీపీ 6 పథకాలతో పాటు జనసేన 5 అంశాలపై సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించి సాయంత్రం వరకు చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ 6 పథకాలు, జనసేన 5 అంశాలకు మేనిఫెస్టో కమిటీ ఆమోదం తెలిపింది. సూక్ష, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ సబ్సిడి, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటి అంశాలకు టీడీపీ, జనసేన మేనిపెస్టో కమిటీ సభ్యులు అంగీకరించారు. ఈ మేరకు ప్రకటన చేశారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఉమ్మడి మేనిఫెస్ట్ కమిటీ సభ్యుడు యనమల మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో లేని సమస్యలను జగన్ సృష్టించారని మండిపడ్డారు. ఈ సమస్యలను పరిష్కరించే అంశాలూ ఉమ్మడి మేనిఫెస్టోలో రూపొందించామని చెప్పారు. ఈ సమస్యలపై అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించి తుది మేనిఫెస్టో‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సంక్షమం, అభివృద్ధి రెండు కళ్లలా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని యనమల తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed