- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: వైసీపీ, బీజేపీల మధ్య వార్ ఉత్తదేనా?
- మైనారిటీ ఓట్ల కోసం వైసీపీకి బీజేపీ సహకారం
- టీడీపీకి మల్లకుండా ఉండేందుకు క్విడ్ ప్రో కో
- నిన్న, మెున్నటి వరకు అచ్చికబుచ్చికలా?
- ఎన్నికలకు ముందు వార్‌పై సర్వత్రా సందేహాలు
- బీజేపీపై వైసీపీ విమర్శలు
- నామ్‌కే వాస్తేగా విమర్శలతో ప్రజల్లో అనుమానం
- వైసీపీ అవినీతిని బట్టబయలు చేయాలంటే కేంద్రానికి క్షణాల్లో పని
- కానీ ఆరోపణలతోనే సరిపెట్టడం వ్యూహమేనంటూ విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: నాలుగేళ్లుగా ఒకళ్లకొకళ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లుల విషయంలో అచ్చికబుచ్చికలాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోయినా అధికార పార్టీ నాయకులు నోరు మెదపలేదు. అంతేకాదు కేంద్రంలోని పెద్దలు తాన అంటే రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు తందాన అనేవారు. అంతే మరో ఏడాదిలోగా ఎన్నికలు ఉండటంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు నువ్వే దొంగ అంటే కాదు కాదు నువ్వే దొంగ అంటూ ఇరు పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ..వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తుంటే ఇన్నాళ్లు గమ్మున ఉన్న వైసీపీ సైతం తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు భేటీ తర్వాత బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. కానీ ఇదంతా ఒక పొలిటికల్ ఎత్తుగడ మాత్రమేనని ఒక ప్రచారం జరుగుతుంది. ఏపీలోని మైనారిటీల ఓట్లు గంపగుత్తగా వైసీపీ పడేందుకు అటు బీజేపీ, ఇటు వైసీపీ దోబూచులాడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ, బీజేపీల మధ్య బంధం రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఎన్నికలకు ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ బంధానికి బ్రేక్ పడిందని చెప్తే నమ్మలాల అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల వెనుక మైనారిటీ ఓటర్ల మంత్రాంగం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీలోని అగ్రనేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
విమర్శల దాడి వెనుక వ్యూహం
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అగ్రనేతలు వరుస విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా వరుస విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పుత్ర వాత్సల్యంతో చూసే దత్త తండ్రి మోడీ, తండ్రిలా గౌరవించే దత్త పుత్రుడు జగన్‌ల బంధానికి బ్రేక్ అయిందంటే మేమ్ నమ్మాలా ? అంటూ పలువురు గుసగుసలాడుకుంటున్నారు. వైసీపీపై బీజేపీ విమర్శలు చేయడం వెనుక ఓటు బ్యాకు రాజకీయం ఉందని ప్రచారం జరుగుతుంది. ‘మీకు మేము మాకు మీరే’ అన్నట్లు ఎన్నికల వేళ బీజేపీ, వైసీపీ దోబూచులాడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీకి మైనారిటీ ఓటర్లు దూరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మైనారిటీ ఓటర్లను వైసీపీకి దగ్గర చేసేందుకు బీజేపీ వరుస సభలు సమావేశాలు పెట్టి వైసీపీపై విమర్శలు చేస్తుందనే కొత్త ప్రచారం జరుగుతుంది. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వైసీపీకు పడాలంటే బీజేపీతో తారా స్థాయిలో గొడవ జరగాలి. ఒకళ్ళపై మరొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవాలి. అదే జగన్ ప్లాన్. అందులో భాగంగానే ఈ దొంగాట అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మైనారిటీ ఓటర్లే టార్గెట్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ కూడా తమతో కలిసి రావాలని అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడులు సైతం బీజేపీ అగ్రనాయకత్వం వద్ద ప్రతిపాదన పెట్టారు. 2014 ఎన్నికల మాదిరిగా మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్దామని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై బీజేపీ అగ్రనాయకత్వం క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ ససేమిరా అంటుంది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుతో బీజేపీ దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తే టీడీపీ,జనసేనతో బీజేపీ కలిసి పనిచేసే అంశంపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే తరుణంలో అవసరమైతే టీడీపీ కోసం బీజేపీకి కటీఫ్ చెప్పడానికి కూడా పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంచనాలను ముందే పసిగట్టిన బీజేపీ మైనారిటీ ఓటర్లను ఈ పార్టీలకు మళ్లకుండా ఉండేలా వ్యూహరచన చేస్తోందని ప్రచారం జరుగుతంది. టీడీపీ, జనసేన జట్టుకట్టి ఎన్నికలకు బరిలోకి దిగితే మైనారిటీ ఓట్లు ఆ కూటమికి పడకుండా బీజేపీ ఎత్తుగడ వేస్తోందనే ప్రచారం జరుగుతుంది. అంటే జగన్ కోవర్టుగా బీజేపీ పని చేస్తుందని ప్రచారం జరుగుతుంది. బీజేపీ వల్ల ఓట్ల రూపంలో పైసా ప్రయోజనం లేకపోగా జగన్ అంటే మొహం మొత్తి, టీడీపీ, జనసేన కూటమికి ఓటేద్దామ్ అనుకున్న మైనారిటీలను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. బీజేపీ వల్ల ఓట్లు రావని తెలిసినా..తన పవర్‌తో ఎన్నికల్లో జగన్‌కి బీజేపీ ఇలా లబ్ధి చేకూరుస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ సహకరించాయని అందువల్లే ఎన్నికలు సజావుగా జరిగాయన్నది ఎలాంటి సందేహం లేదు.
ఏపీతో బీజేపీ దోబూచులాట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బీజేపీ ఒంటి చేత్తో శాసిస్తుందని ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్న వైసీపీని కేసుల బూచి చూపి తమ దొడ్లో కట్టేసుకుంది. అటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని జగన్ బూచిని చూపి పెరట్లో కట్టేసుకుంది.ఇక ఏ పక్షమూ కాని పవన్ కల్యాణ్‌ని కట్టేసే కారణం లేకున్నా, కట్టేసే అవసరం కూడా లేదని భావించింది. ఇక రాష్ట్రం కోసం అడిగేదెవరు, కొట్లాడేదెవరు ? అందుకే తాను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు బీజేపీ ఏపీ రాజకీయల పట్ల వ్యవహరిస్తోంది. ఇదే రాజకీయం జరిగితే భవిష్యత్‌లో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఏపిని కాపాడే పరిపాలన దక్షకుడు కావాలి. ప్రత్యేక హోదా మొదలు, రైల్వే జోన్, అమరావతి రాజధాని, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ... ఇలా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించే మొనగాడు కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ మెడలే కాదు, నడుములు కూడా వంచే యోధుడైన నాయకుడు రాష్ట్రానికి కావాలి అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది.