- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kapu Politics: ఎవరితో ఉంటారో తెల్చుకోండి.. కాపులకు మంత్రి అంబటి సూచన
దిశ, వెబ్ డెస్క్: కాపుల అంశంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కాపులు.. సీఎం జగన్‌తో ఉంటారో చంద్రబాబుకు ఊడిగం చేసే పవన్ కల్యాణ్‌తో ఉంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. తాను ఘాటుగా విమర్శించినంతగా వైసీపీలో ఎవరూ విమర్శించరన్నారు. అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
ఇటీవల కాలంలో కాపులే టార్గెట్‌గా రాష్ట్రంలో రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీలు కూడా కాపులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాపు నేతలు కులాన్ని కించపరుస్తున్నారంటూ మండిపడ్డారు.అప్పటి నుంచి పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అంతేకాదు మంత్రి అంబటి రాంబాబు లబ్దిదారుల నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.అయితే లబ్ధిదారులే మీడియా పరంగా అంబటి లంచం అడిగిన విషయాన్ని చెప్పడంతో సైలెంట్ అయ్యారు.
తాజాగా కాపుల అంశంపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ కామెంట్లకు జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.