Guntur: కూలిన కృష్ణా నది రిటైనింగ్ వాల్.. డేంజర్ జోన్‌లో సీతానగరం

by srinivas |   ( Updated:2024-10-25 11:40:21.0  )
Guntur: కూలిన కృష్ణా నది రిటైనింగ్ వాల్.. డేంజర్ జోన్‌లో సీతానగరం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం(Guntur Sitanagaram) డేంజర్ జోన్‌లో ఉంది. కృష్ణానది రిటైనింగ్ వాల్(Krishna river retaining wall) కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి ఈ గోడ పూర్తిగా దెబ్బతింది. అంతకుముందే ఈ వాల్ బీటలు వారింది. ఒక్కసారిగా వర్షం పడటంతో వాల్ కృష్ణానదిలోకి పడిపోయింది. అయితే ఇప్పటివరకూ ఎవరు పట్టించుకోలేదు. సీతానగరంలోని పుష్కర ఘాట్ రోడ్ వద్ద జనసంచారం ఎక్కువగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ఆదమరిస్తే కృష్ణా నదిలో పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దసరా ఉత్సవాలకు కృష్ణా బ్యారేజ్‌ను లైటింగ్‌తో భారీగా అలంకరించారు. కానీ రిటైనింగ్ వాల్ మరమ్మతులు మాత్రం చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిటైనింగ్ వాల్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed