- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gummanuru Jayaram: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు గుమ్మనూరు జయరాం రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ.. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ జయరాంను అడగడంతో ఆయన ససేమిరీ అన్నారు.
దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారని గమ్మనూరు జయరాం ఆరోపించరా. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. నేడు సాయంత్రం మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ గర్జన’ బహిరంగ సభ సందర్భంగా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.