పచ్చి మోసగాడు కేశినేని నాని.. టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్

by Shiva |
పచ్చి మోసగాడు కేశినేని నాని.. టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేశినేని నాని పచ్చి మోసగాడని, తెలుగుదేశంలో అత్యంత అవినీతికి పాల్పడింది ఎవరో చెప్పాలంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొంది ఇన్నాళ్లు కేశినేని నాని వైపీకి కోవర్టుగా పని చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ టీడీపీలో చేరేందకు సిద్ధమైతే, అతడికి పార్టీలో చేరకూడదని చెప్పింది కేశినేని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో స్థిరంగా ఉండే వ్యక్తి కేశినేని కాదని, పార్టీలు మారే వ్యక్తి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి డిపాజిట్ కూడా దక్కదంటూ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అంటున్నారు.

Advertisement

Next Story