మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్

by Mahesh |
మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాక్ ఇచ్చేలా ఉంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం మద్యం లైసెన్సులకు సంబంధించిన అప్లికేషన్ల గడువు ముగియనుంది. ఈ సమయంలో ప్రభుత్వం మద్యం ధరల రౌండప్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం కారణంగా కొత్తగా వచ్చే మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన లిక్కర్ పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంతో మద్యం బాటిల్ ధర రూ. 150, 200 ఉంటే ధరలో ఎటువంటి మార్పు ఉండదు. అలా కాకుండా అర్ధ రూపాయి అటు ఇటు ఉన్నట్లు రౌండాఫ్ చేసి. రూ. 160, 210 వసూలు చేస్తారు. ఒక వేల సీసా ధర రూ. 90.50 ఉంటే దానిపై రూ. 99 వసూలు చేయనున్నారు. దీంతో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రౌండాఫ్ పేరుతో ధరలు పెంచేందుకు చూస్తోందని ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed