AP Sapnet : ఏపీలో శాప్ నెట్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Y. Venkata Narasimha Reddy |
AP Sapnet : ఏపీలో శాప్ నెట్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh)లో శాప్ నెట్(SAPNET) రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐటీ కార్యదర్శి యువరాజ్ జీవో జారీ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో సోసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్( శాప్ నెట్)ను ఏర్పాటు చేస్తూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మన టీవి నిర్వాహణతో విద్యారంగం కార్యక్రమాల్లో శాప్ నెట్ భాగస్వామ్యమైంది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది.

తాజాగా మూసివేత అనంతరం విద్యామండలి నుంచే సమర్థంగా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాప్ నెట్ రద్దుతో ఈ విభాగానికి చెందిన సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed