ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా ప్రకంపనలు.. కబ్జాలపై ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |
ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా ప్రకంపనలు.. కబ్జాలపై ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భూముల కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కబ్జాదారులకు కీలక పిలుపు నిచ్చింది. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. అలా చేయకపోతే హైడ్రా లాంటి టీమ్‌ను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. కబ్జాకు గురైన భూములను రికవరి చేసుకుంటామని ప్రకటన చేశారు. ప్రభుత్వ భూములను ఎవరైన కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల భూములు కబ్జా అయ్యాయని ప్రభుత్వానికి ప్రతినిత్యం ఫిర్యాదు అందుతున్నాయని, వాటన్నింటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం భూముల కబ్జాలపై సీఎం రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో చెరువులకు సంబంధించిన భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్ డోజర్లతో అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను ఎప్పుడు కూల్చుతారోనని ఆందోళ చేస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలను ఏపీలోనూ తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటన్నింటిని రికవరీ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.

Advertisement

Next Story