AP:విద్యార్థులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
AP:విద్యార్థులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజెంట్ వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ప్రస్తుతం రూ.70,000 ఇస్తుండగా, ఇకపై రూ.80,500 అందిస్తారు. ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్‌కు ఇచ్చే రూ.22,527లను రూ.25,906కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకు స్టైఫండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తల్లికి వందనం పథకం అమలు జరగాల్సి ఉంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed