- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్యం ప్రియులకు కిక్కిచ్చే గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అన్ని బ్రాండ్లతో పాటు!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల (జూన్)12వ తేదీన చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. మద్యం పాలసీపై ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏపీలో కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అవి కూడా ఊరూ పేరు లేని బ్రాండ్లు తెచ్చారంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రతి సభలో అప్పటి విపక్షనేత చంద్రబాబు కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ మద్యం దుకాణాలను వేలం ద్వాదా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మద్యం అమ్మకాలు ప్రభుత్వం పనికాదని అన్నారు. నాసిరకం మందు సరఫరా అవ్వకుండా చూడటమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అని తెలిపారు. కాగా వేలం పాట నిర్వహించిన మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఇలా చేయడం వల్ల ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశముంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. మద్యం షాప్స్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం ధరలు కూడా తగ్గే అవకాశం ఉందట. ఏపీ ప్రజలకు దీనిపై ఓ క్లారిటీ రావాలంటే 12 వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.