AP News:‘మాకు న్యాయం చేయండి’..రైతు దంపతుల ఆవేదన

by Jakkula Mamatha |
AP News:‘మాకు న్యాయం చేయండి’..రైతు దంపతుల ఆవేదన
X

దిశ,నందికొట్కూరు: తాము సాగు చేసిన పంటను దౌర్జన్యంగా దున్ని నాశనం చేశారని మహిళా రైతు ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. మిడుతూరు మండలం బైరాపురం గ్రామానికి చెందిన రైతు దంపతులు కాళ్ళప్ప గారి ఈశ్వరయ్య, ఉమాదేవి రెండు ఎకరాల పొలంలో కొర్ర పంట సాగు చేశారు. అయితే తమ బంధువులు కుటుంబ కక్షలతో మూడు రోజుల క్రితం కొర్రి పంటను దున్ని నాశనం చేశారన్నారు. మిడుతూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చరణమన్నారు. పంటను నాశనం చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story