Geographical:ఏపీకి ఆ దేశంతో భౌగోళిక సంబంధాలు ..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-18 05:39:26.0  )
Geographical:ఏపీకి ఆ దేశంతో భౌగోళిక సంబంధాలు ..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:ఓ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్‌లో దాగి ఉన్న పురాతన అంశాల గురించి తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సంబంధాల గురించి ఓ అధ్యయనంలో ఏం వెల్లడైందంటే..ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాతో భౌగోళిక సంబంధాలు ఉండేవని హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) తెలిపింది. ఈ పరిశోధనల్లో భాగంగా ఏపీలోని దర్శి, అద్దంకి ప్రాంతాల కింద దాగి ఉన్న శిఖరాన్ని గుర్తించింది. ఈ శిఖరం చారిత్రాత్మకతను కలిగి ఉందనీ, ఇది కడప బేసిన్ దక్షిణం వైపుకు వంగి ఉంటుందని పరిశోధనలు తెలిపాయి. 150 కోట్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా, ఏపీ ఒకే భూభాగంగా ఉండేవని పేర్కొంది. భారత్, తూర్పు అంటార్కిటికా మధ్య భారీ ఘర్షణ జరగడంతో విచ్ఛిన్నమై ఉంటుందని అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed