- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగున్నర ఏళ్ళు గాడిదలు కాసి ఇప్పుడొచ్చావా..?చీఫ్ కి స్ట్రాంగ్ కౌంటర్
దిశ డైనమిక్ బ్యూరో: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పై X వేదికగా విపక్షాలను నిలదీస్తూ ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో.. ఆంధ్రాలో ఉన్న పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసనీ.. మనరాష్ట్రాన్నికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటె ఆంధ్ర అభివృద్ధి ఇంకోలా ఉండేదని.. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైసీపీ రెండు పార్టీలు మోసం చేశాయని.. రెండు పార్టీల అధినేతలు అధికారం లోకి రాకముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి అధికారం లోకి రాగానే ప్రత్యేక హోదా ఊసే మరిచిపోయారని ధ్వజమెత్తుతూ.. తాను నిన్న శ్రీకాకుళం నుండి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణిస్తూ మహిళలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనతో చెప్పుకున్నట్లు రాసుకొచ్చారు. అయితే ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ షర్మిల పై విమర్సల జల్లు కురిపిస్తున్నారు.
రాష్ట్ర పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసు అన్నప్పుడు తమరు ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి.. ? పొద్దు పోక వచ్చారా అక్క అని ఒకరు.. బాగా తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయింది అక్క.. అసలు మా రాష్ట్రం ఇలా అవ్వడానికి కారణం కాంగ్రెస్.. మేము అది ఎప్పటికి మర్చిపోము.. సొల్లు చెప్పింది చాలు.. ఆడబిడ్డకు ఇక్కడ ఏం పని అక్కడికి పో అని మరొకరు.. కామెంట్ చేయగా.. మరో వ్యక్తి నాలుగున్నర ఏళ్ళు గాడిదలు కాసి ఇపుడొచ్చావా అక్క అని కామెంట్ చేశారు. ఇలా నెటిజన్స్ షర్మిల పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.