Breaking: ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగిన కేశినాని నాని

by srinivas |   ( Updated:2024-06-10 13:06:01.0  )
Breaking: ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగిన కేశినాని నాని
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విజయవాడ ప్రజలు తనకు రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పించారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. కాగా మొన్నటి ఎన్నికల్లో కేశినేని నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. కేశినేని నానిపై పోటీ చేసిన ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఘన విజయం సాధించారు. దీంతో రాజకీయాల నుంచి వైదొలగాలని కేశినేని నాని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.

‘‘చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం ప్రకటించా. ఇక నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతిస్తా. నా రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాజకీయ అనుభవాలు, జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నా. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేశా. ఆ అపురూపమైన అవకాశం కల్పించిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు.’’ అని కేశినేని నాని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed