- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పదవులకు రాజీనామా చేశా.. మాట్లాడే పెదవులకు విరమణ లేదు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : పదవులకు తాను రాజీనామా చేశానే తప్ప మాట్లాడే పెదవులకు పదవీ విరమణ ఇవ్వలేదు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరు ఆర్‌వీఅర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల ఎనిమిదవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువతను మేల్కోల్పడం తనకు ఎంతో ఇష్టం అని అన్నారు. అంతేకాకుండా నిత్యం ప్రజలతో గడపాలని భావిస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. ఇవి రెండూ తనకు అత్యంత ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యావిధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యావిధానాన్ని భారతీయకరణ చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు.
ప్రపంచంలో యువ శక్తి అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం మాత్రమేనని వెంకయ్య నాయుడు తెలిపారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా దూకుసుపోతున్నారని కొనియాడారు. ప్రపంచంలో వస్తున్న మార్పులతో ఉపాధి అవకాశాల తో పాటు పోటీ తత్వం, సవాళ్లు కూడా పెరుగుతున్నాయంటూ వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. యువత క్రమశిక్షణ, కష్టపడే తత్వం, కలుపుగోలుగా ఉండటం అలవరుచుకోవాలని వెంకయ్య సూచించారు. ప్రాశ్చాత్య ధోరణి మన దేశానికి, యువతకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భారతీయ ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రతీ యువకుడి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా అనేది మతానికి సంబంధించిన అంశం కాదని…ప్రపంచం ఆచరిస్తున్న ఆరోగ్య మంత్రం అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.