సీఎం జగన్ ఓటమి ఖాయం..అందుకే ఆ కార్యక్రమాలు: ధూళిపాళ్ల నరేంద్ర

by srinivas |   ( Updated:2024-03-28 17:35:51.0  )
సీఎం జగన్ ఓటమి ఖాయం..అందుకే ఆ కార్యక్రమాలు: ధూళిపాళ్ల నరేంద్ర
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోవడం ఖాయమై పోయిందని, అందుకే చిల్లర కార్యక్రమాలు ప్రారంభించారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సంగం డెయిరీ చైర్మన్, డీవీసీ ఆస్పత్రి డైరెక్టర్‌గా తొలగించాలని తనపై ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి అంబటి మురళి ఫిర్యాదు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో దందాలు చేస్తున్నారని, అయోధ్య రామిరెడ్డి రాంకీ ఉద్యోగుల ద్వారా డబ్బుల పంపిణీకి రెడీ అయ్యారని ఆరోపించారు. రాంకీ కంపెనీపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కిలారి రోశయ్య వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలుకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని, మంత్రులను తొలగిస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ప్రభుత్వ డబ్బులు లేని సంగం డెయిరీకి, ఎన్నికల సంఘానికి సంబంధమేంటని ప్రశ్నించారు. కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీకి ఆర్వో ఎలా వస్తారని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

Advertisement

Next Story