పవన్ ఏది చెబితే అది చేస్తా.. ఒంగోలు వివాదంపై స్పందించిన బాలినేని

by srinivas |   ( Updated:2024-09-26 17:05:44.0  )
పవన్ ఏది చెబితే అది చేస్తా.. ఒంగోలు వివాదంపై స్పందించిన బాలినేని
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) ఏది చెబితే అది చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి(Former Minister Balineni SrinivasuluReddy) అన్నారు. పవన్ సమక్షంలో జనసేనలో ఆయన చేరారు. ఈ సందర్భంగా ఒంగోలు(Ongole) నియోజకవర్గంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. కొత్త, పాత కార్యకర్తలతో కలిసి ఒంగోలులో జనసేన(Janasena) బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పారు. తన చేరికతో కూటమికి ఎలాంటి నష్టం ఉండదని బాలినేని తెలిపారు. కాగా జనసేనలో బాలినేని శ్రీనివాస్ చేరడంపై ఒంగోలులోని కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో బాలినేని భారీగా అవినీతికి పాల్పడ్డారని, ప్రశ్నించిన తమపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నుంచి తప్పించుకునేందుకే బాలినేని జనసేనలో చేరుతున్నారని, ఏ పార్టీలో చేరినా ఆయనను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బాలినేని స్పందించారు. పవన్ చెప్పినట్లే నడుచుకుంటామని బాలినేని తెలిపారు. తాను ఎక్కడ కూడా తేడా చేయనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story