- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీకి రోజా భారీ షాక్.. పార్టీ పేరు తొలగింపు
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రోజా భారీ షాక్ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. నిన్న, మొన్నటి వరకూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా పేరు ఉండేది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఆమె ఛేంజ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను అన్ ఫాలో చేశారు. జగన్‌తో ఉన్న ఫొటోను కూడా తొలగించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ మొదలైంది. ఈ పరిణామంతో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్‌కు గురయ్యారు. మరి పార్టీ పేరు తొలగింపు, జగన్‌ను అన్ ఫాలో చేయడం వెనుక ఉన్న కారణాలు తెలియాలంటే రోజానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.
కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడంతో ఆమె అప్పటి నుంచి స్తబ్దుగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో రోజాపై తీవ్ర విమర్శలు వస్తున్నా ఏ మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన ఆమె రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ నేతలపై పదునైన వ్యాఖ్యలతో ఎటాక్ చేశారు. కొన్ని సమయాల్లో విచక్షణ కోల్పోయి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.