- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేషన్ బియ్యం రవాణా వెనుక ఆయన వియ్యంకుడే: పేర్ని నాని సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ(Kakinada) వద్ద సముద్రంలో రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ తరలింపు వ్యవహారంలో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. పేదలకు అందాల్సిన పీడీఎస్ రైస్ అక్రమార్కుల పాలుకావడంపై అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan kalyan) సైతం సీరియస్ అయ్యారు. సముద్రం ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులు, స్థానిక నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ అక్రమ వ్యవహారం అటు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. గత ప్రభుత్వంలోనే రేషన్ బియ్యం అక్రమ దందాకు తెరతీశారని, రాష్ట్రంలో పాలన మారినప్పటికీ తీరు మారలేదనే ఆరోపణలు వినిస్తున్నాయి.
దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)నాయకులు ఎదురుదాడికి దిగారు. మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) తాజాగా మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం సరఫరాపై సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా వెనుక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు ఉన్నారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. 42 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒకే వ్యక్తి తరలిస్తున్నారని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు సమయంలో కాకినాడ సముద్రంలో స్టెట్లా షిప్‌ను మాత్రమే తనిఖీలు చేశారని, కెన్ స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. వెంటనే ఆ షిప్‌పై విచారణ జరపాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.