- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ కల నెరవేరబోతోంది: మాజీ మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశించిన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత స్వార్థం ఉన్న వ్యక్తి కాదని.. నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఆలోచించే తాను నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. అతి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు.
నాలుగేళ్లు వైపీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఎకరాకు నీరు రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇవ్వాలని కోరబోతున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన సమయంలో కంటే వైఎస్ జగన్ పాలనలో వంద రేట్లు నష్టపోయామని కొణతాల ఆరోపించారు. కాగా, ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి, కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Read More...