మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై కోడి గుడ్ల వర్షం

by Gantepaka Srikanth |   ( Updated:2024-06-07 15:55:06.0  )
మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై కోడి గుడ్ల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని ఐదోసారి ఓటమి చెందారు. తొలిసారి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. జగన్ కేబినెట్లో ఆయన మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అనూహ్యంగా ఈసారి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఓడిపోయారు. ఇదిలా తాజాగా ఆయనకు అనూహ్య పరిణామం ఎదురైంది. శుక్రవారం గుడివాడలోని కొడాలి నాని ఇంటిపై కొందరు యువకులు హల్‌చల్ చేశారు. నాని ఇంటిపై కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం సదరు యువకులను అక్కడి నుంచి పంపించివేశారు.

Advertisement

Next Story