Harirama Jogaiah: పవన్ కల్యాణ్‌కు మద్దతుగా లేఖ

by srinivas |   ( Updated:2024-02-12 10:38:11.0  )
Harirama Jogaiah: పవన్ కల్యాణ్‌కు మద్దతుగా లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మద్దతు ఇవ్వాలంటూ మాజీ మంత్రి, కాపు సంఘం సేన వ్యవహస్థాపకుడు హరి రామ జోగయ్య లేఖ రాశారు. జనసేనకు మద్దతుగా ఆయన ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశారు. ఈసారి మాత్రం‘కాపులకు మేలుకొలుపు’అంటూ బహిరంగ లేఖ రాశారు. రాజ్యాధాకారం దక్కాలంటే కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కడిగా నిలబడాలని సూచించారు. అందుకు ధైర్యవంతుడైన నేత, జనాకర్షన గల సవ్యసాచి కావాలని పేర్కొన్నారు. గతంలో చిరంజీవి వచ్చాడని.. ఆయనకు అందరూ అండగా నిలిచారని.. ఇక అభిమన్యుడు మిగిలి ఉన్నాడని లేఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్న చిరంజీవి బాటలోనే పవన్ నడుస్తున్నాడని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు స్పష్టమైన లక్ష్యం ఉందని ఆయన పేర్కొన్నారు. బలవంతుడిని ఢీకొట్టాలంటే అందుకు తగ్గ బలం ఉండాలని.. అవసరమైతే ఇతరుల బలం తీసుకోవాలని హరిరామ జోగయ్య సూచించారు. ఆ రాజనీతిజ్ఞత తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు రావాల్సిన సీట్ల కోసం ప్రస్తుతం పవన్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పవన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓ వ్యూహం ఉందని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ధైర్యంగా ముందుకు నడవాలని, ఐక్యత ప్రదర్శిస్తే రాజ్యాధికారం దక్కుందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed