- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం బ్యారేజీ బోట్ల ఢీ కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ స్ట్రాంగ్ రియాక్షన్
ప్రకాశం బ్యారేజీ బోట్ల ఢీ కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ స్ట్రాంగ్ రియాక్షన్
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన విషయం తెలిసింది. అయితే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులు రామ్మోహన్, ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారన్నారు. చంద్రబాబు చేతిలోనే ప్రభుత్వం ఉందని, ఘటనపై విచారణ చేయించలేరా అని నిలదీశారు. వైసీపీ నేతలతో రామ్మోహన్ అనే వ్యక్తి ఫొటోలు దిగితే బోట్ల నెపం తమపై నెడతారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై చెప్పండని బోటు ఓనర్లపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. వరదలపై పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు. కుట్రలో భాగంగానే వైసీపీ నేతలపై నెపం మోపుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story