- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 Election: మోదీ చరిష్మా తోడైతే ఆయనే సీఎం!
దిశ, డైనమిక్ బ్యూరో: కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ఐదేళ్లు సీఎంగా ఉండటం ఖాయమని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన బలం బాగా పెరిగిందని చెప్పారు. టీడీపీ, వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు.
మరోవైపు బీజేపీతో కలిస్తే మోడీ చరిష్మా తోడై అదనపు బలం చేకూరుతుందని చేగొండి హరిరామయ్య వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పోటీ చేస్తే ఇక వైసీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తేనే వైసీపీని ఓడించగలరని...అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ముందుగా ప్రకటించాలంటూ హరిరామ జోగయ్య కండీషన్ పెట్టారు. అలా కాకుండా పవన్ కల్యాణ్ ఎన్నికలకు వెళ్లానుకుంటే బీజేపీని కలుపుకుని వెళ్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీతో కాదనుకుంటే175 నియోజకవర్గాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు.