లడ్డూ వివాదం.. జగన్‌ను అభాసుపాలు చేస్తున్నారంటూ అంబటి ఆగ్రహం

by srinivas |
లడ్డూ వివాదం.. జగన్‌ను అభాసుపాలు చేస్తున్నారంటూ అంబటి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) స్పందించారు. శ్రీవారి ప్రసాదం(Tirumala Prasadam)పై సీఎం చంద్రబాబు (Cm Chandrababu) భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం జగన్‌(Former Cm Jagan)ను అభాసుపాలు చేయాలనే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వరదల(Vijayawada Floods)కు సైతం జగనే కారణమంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్‌పై ఎందుకింత కక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. కావాలనే వివాదాలు సృష్టించి అందరూ చర్చించుకునేలా చేస్తున్నారంటూ అంబటి వ్యాఖ్యానించారు.

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్నా అదీ జగన్ అకౌంట్‌లోనే వేశారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా జగన్ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిపై రిపోర్టు వచ్చి రెండు నెలలు అవుతోందని, కానీ ఇప్పుడే ఎందుకు బయటపెట్టారని అంబటి నిలదీశారు. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదంపైనే చర్చ జరుగుతోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటించిన తర్వాతే లడ్డూ నెయ్యిపై టీటీడీ (TTD) సమర్థించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబుకు వైసీపీ అంటే కోపమని అందుకే భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తు్న్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed