మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి

by Javid Pasha |
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ నాయకత్వం కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇకపోతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఇటీవలే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.

అయితే ఇప్పటి వరకు ఆయనకు పార్టీ పరంగా ఎలాంటి పదవి అప్పగించలేదు. అయితే ఇలాంటి తరుణంలో ఆయనను నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ ఆయనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed