YS Jagan:‘కార్యకర్తలకు అండగా ఉంటా’.. మాజీ సీఎం జగన్ కీలక హామీ

by Jakkula Mamatha |   ( Updated:2024-11-08 14:04:37.0  )
YS Jagan:‘కార్యకర్తలకు అండగా ఉంటా’.. మాజీ సీఎం జగన్ కీలక హామీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం(Government) పై సోషల్ మీడియా ట్రోలింగ్స్(Social Midea Trolings) చేస్తున్నారని కూటమి మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కూటమి ప్రభుత్వం(AP Government) చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైఎస్ జగన్(YS Jagan) ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని.. ఈ యుద్ధంలో కచ్ఛితంగా న్యాయమే గెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో తమ కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్భంధాలు జరుగుతున్నాయని ప్రతి సైనికుడికి అండగా నిలుస్తానని మాజీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Advertisement

Next Story